విశ్వనాధుడా Click here to watch on YouTube. Telugu Lyrics: ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయవీరుడా “2” ఆపత్కాలమందున్న - సర్వలోకమందున్న దీనజనాల దీపముగ వెలుగుచున్నవాడ “2” ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము “2” నీ కృప ఎంత వున్నతమో వర్ణించలేము స్వామీ నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా “2” పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము “2” ఇహమందు పరమందు నాకు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేస్సయ్యా “2” నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా “2” భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే “2” బలమైన గణమైన నీ నామమందు హర్షించి భజియించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్య కరువైనా శ్రమ అయినా జీవనపోరాటాలైన నీ పైనే ఆనుకోని జీవించేదెను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా “2” నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ...