Posts

Showing posts from September, 2024

నాన్న నీ ఇంటికి | Nanna ni intiki song lyrics in telugu

నాన్న నీ ఇంటికి నే దూరమై Click here to listen on YouTube. Telugu Lyrics: పల్లవి: నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతకలేనయ్య    “2” బ్రతకలేనయ్య    “4” నిన్ను విడిచి నేను బ్రతకలేనయ    “2”                                “నాన్న” చరణం :1️⃣ స్నేహితులే సొంతం అనుకొని లోక సంపదలే శాశ్వతమని    “2” నీ చేయి విడిచితి నీ తోడు మరచితి    “2” కరుణించి దరిచేర్చుమ...    “2”                                     “నాన్న” చరణం :2️⃣ నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరం చేసుకొంటిని    “2” అలసి పోతిని కృశించు చుంటిని    “2” నీ కృపతో బ్రతికించుమా…….    “2”                                     “నాన్న” చరణం :3️⃣ నీ రాజ్యము చేరాలని  నీ చిత్తము చేయాలని    ...

నీ స్వరమే విన్నా | Nee swarane vinna song lyrics

నీ స్వరమే విన్నా Click here to watch on YouTube. Telugu Lyrics: నీ  స్వరమే విన్నా – నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య నా చెలిమే నీవై – నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన – నీ కోసమే ఆరాధనా – నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే 1. నిన్ను చూడ – నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ – విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ – నిమిషమైన వీడిపోనీ సంబంధమే సొంతమైన ఆనందమే 2. ఆశతీర – యేసు నీలో పరవసించే – నా ప్రాణము ప్రాణనాథా – ఎన్నడైనా మరువలేను – నీ త్యాగము కానరాదే – ఈ జగాన నిన్ను పోలి – ఏ బంధము ఆరిపోని – అనుబంధము

స్తుతియించెద - సర్వోన్నతా | Sthuthiyincheda sarvonatha song lyrics

స్తుతియించెద - సర్వోన్నతా Click here to watch on YouTube. Telugu Lyrics: నీవే ఆశ - నీవే శ్వాస - నీవేగా - అతిశ్రేష్ఠుడా  నాలో ప్రాణం - నాలో జీవం - నీవేగా - బలవంతుడా ప్రేమ పూర్ణుడ - నా దేవ పావనాత్ముడ - యేసయ్య స్తుతికి పాత్రుడ - నా దేవ నా నిరీక్షణ - నీవేగ స్తుతియించెద - సర్వోన్నతా - పూజించెద - ప్రభువా యేసయా  బలమైన నీ నామం “నీవే” 1. నీదు ప్రేమ నిండే నాలో - నీవే చెరగని ప్రపంచం నాలో నీవు నీలో నేను - నీవే తరగని వరం వెలిగించవా - నడిపించవా నీ మాటతో ఇల వశియించవా - నిజదేవుడా ఆధారమై ఇల “స్తుతియించెద” 2.    యేసు నీవే నాలో స్వాస్థ్యం - నీతో నిరతము ప్రయాణం  నీతో స్నేహం - నింపే ధైర్యం - నీవే పరముకు పథం చిరకాలము - నను కాచిన నా మంచి కాపరి కనుపాపగా - కాపాడిన నీవేగ నా గురి “స్తుతియించెద”