Dhyaninchuchuntimi Song Lyrics

 ధ్యానించుచుంటిమి

            ధ్యానించుచుంటిమి - శిలువపై పలికిన - విలువైన నీ మాటలు "2"

            ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు "2"

            మోక్షమునకు చేర్చు బాటలు

            పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణ సంపన్నుడా " 2" - శ్రేష్ఠుడా 


1. తండ్రీ వీరేమిచేయుచున్నారో ఎరుగరు - వీరిని దయతో క్షమించుము "2"    

    అని ప్రార్థన చేశావా బాధించే వారికై "2"

   శత్రువులను ప్రేమించుట నేర్పుటకై  "2"    'పరిశుద్ధతలో'


2. నేడే నాతోను  పరదైసులో నీవుందువు - నిశ్చయముగ ప్రవేశింతువు "2"    

    అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి "2"    

    అధికారముతో పాపిని రక్షించి "2"  'పరిశుద్ధతలో'


3. ఇదిగో నీతల్లి ఇతడే నీకుమారుడు - కష్టము రానీయకు ఎపుడూ "2"    

    అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను "2"    

    తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను "2"    'పరిశుద్ధతలో'


4. దేవా నాదేవా నను విడనాడితివెందుకు - చెవినీయవే నా ప్రార్థనకు "2"    

    అని కేక వేసావా శిక్షననుభవిస్తూ "2"    

    పరలోకమార్గం సిద్దము చేస్తూ "2"    'పరిశుద్ధతలో'


5. సర్వసృష్టి కర్తను నే దప్పిగొనుచుంటిని - వాక్యము నెరవేర్చుచుంటిని "2"    

   అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు "2"    

   జీవజలమును అనుగ్రహించుటకు "2"    'పరిశుద్ధతలో'


6. సమాప్తమైయుంది లోక విమోచనకార్యం - నెరవేరెను ఘనసంకల్పం "2"    

    అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి "2"    

    పనిముగించి నీ తండ్రిని ఘనపరచి "2"   'పరిశుద్ధతలో'


7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని - నీ యొద్దకు వచ్చుచుంటిని "2"    

    అని విన్నవించావా విధేయతతోటి "2"   

   తలవంచి విజయముతృప్తిగా విజయము చాటి "2"   'పరిశుద్ధతలో'


Click here to listen on youtube.

Comments

Popular posts from this blog

స్థిరపరచువాడవు | Emaina Cheyagalavu Song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Karunasampannuda Hosanna ministries 2022 new song