Viswasa veeruda song Lyrics
విశ్వాస వీరుడా
విశ్వాస వీరుడా ఓ క్రైస్తవుడా -
ఆగిపోక సాగిపో ఓ మంచి సైనికుడా " 2 "
పరిశుద్ధాత్మ కలిగి శుద్ధునిగా జీవించు -
రాకడకు వేచిచూడుము ప్రియనేస్తమా " 2 "
॥విశ్వాస వీరుడా॥
తుఫాను చెలరేగినా -
సంద్రమే ఎదురొచ్చినా
శత్రువే తరుముచున్ననూ-
తెగులే సమీపించినా " 2 "
దైవ కృప నీకు తోడుండగా -
ఈ లోకములో భయపడకు నేస్తమా " 2 "
॥విశ్వాస వీరుడా॥
విశ్వాసయాత్రలో సాగిపోవుచుండగా -
కలిమి లేమియు సంభవించిననూ " 2 "
సత్య కృప నీకు తోడుండగా -
ఈ లోకములో భయపడకు నేస్తమా " 2 "
"విశ్వాస వీరుడా"
రక్షణ భాగ్యమును నిర్లక్ష్య పరచకు -
శాశ్వత రాజ్యములో చేరే పర్యంతము " 2 "
నిత్య కృప నీకు తోడుండగా -
ఈ లోకములో భయపడకు నేస్తమా " 2 "
విశ్వాస వీరుడా ఓ క్రైస్తవుడా
ఆగిపోక సాగిపో ఓ మంచి సైనికుడా " 2 "
పరిశుద్ధాత్మ కలిగి శుద్ధునిగా జీవించు -
రాకడకు వేచియుండుము ప్రియనేస్తమా " 2 "
"విశ్వాస వీరుడా"
Watch on YouTube
Comments
Post a Comment