Prabhuva nee karyamulu song by Sharon sister's
ప్రభువా నీ కార్యములు
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి.
దేవా నీదు క్రియలు అద్భతములై యున్నవి (2X)
నే పాడెదన్ చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా(2X)
హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2x)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
.. సన్నుతించెదనూ...(2X)
హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
..సన్నుతించెదనూ... (2X)
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
నే పాడెదన్ చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)
Click here to watch on YouTube
Comments
Post a Comment