Viduvaledennadu neevu naa cheyi song Lyrics
విడువలేదెన్నడూ నీవు నా చేయి
click here to watch on Youtube.
విడువలేదెన్నడూ నీవు నా చేయి
మరువలేదెన్నడూ నన్ను నీ కృప "2"
యేసయ్యా... రక్షణ ప్రాకారమా...
యేసయ్యా... నాకున్న ఆధారమా "2"
నా గుడారముపై నీ దృష్టిని నిలిపి
ప్రతి శాపమును తొలగించినావు
పరలోక సంపదలు సమృద్ధిగా నింపి
ఆశీర్వదించి హెచ్చించినావు "2"
నీ సరిహద్దులను నే దాటిపోకుండా
నీ పాదసన్నిధిలో నను నిలిపినావు "2" "విడువలేదెన్నడూ"
నీవుండు స్థలములో నేనుండాలని
పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో
మలిన వస్త్రములు తీసివేసి
రక్షణ వస్త్రములు తొడిగించినావు "2"
అర్హత లేకున్నా నీ సేవ కొరకు
యాజక వస్త్రములు ధరింపచేసితివి "2" "విడువలేదెన్నడూ"
ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద
దాచియుంచితివి ఈనాటి వరకు
నీ మందిరములో పూర్ణ హృదయముతో
ఆరాధించుటకు ఆత్మతో నింపితివి "2"
నీకు విరోధముగా రూపించే
ఏ ఆయుధము వర్ధిల్లదంటివే "2" "విడువలేదెన్నడూ"
Comments
Post a Comment