STUTHI GEETHAMU || JOEL KODALI ||
CLICK HERE to watch on YouTube
యేసు నీ అద్భుత ప్రేమ నేనేల మరిచెద దేవా
నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి యెరిగినవాడను
ఎండిన నా బ్రతుకులో జీవముగా నీవు చేరితివి
నీ ప్రేమ జలములతో నను తడిపి బ్రతికించితివి
నీ వాత్సల్యమును - నీ కారుణ్యమును స్మరియించుచు దేవా
నే పాడేదనూ స్తుతి గీతము
నే పాడేదనూ స్తుతి గీతము
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు
కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి
పాపమును ఎరుగని దేవా నాకై పాపముగా మారి నా వ్యసనములను భరియించి సిలువలో ప్రాణము విడిచితివి అమూల్యమైన నీ రక్తముచే నను నీవు విమోచించితివి నీప్రేమ లోతులలో శాశ్వతముగా నను బందించితివి
నీ కల్వరి యాగం కనపరచిన ప్రేమ
తలపోయుచు దేవా
నే పాడేదనూ స్తుతి గీతము
నే పాడేదనూ స్తుతి గీతము
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి
Comments
Post a Comment