Amaramaina Prema song Lyrics
Amaramaina Prema || అమరమైన ప్రేమ
Telugu Lyrics :
ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయే - నా మదిలో దీపము నీవే "2"
నిన్నాశ్రయించిన వారిని- ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు "2" " ప్రేమే "
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము "2"
ఇన్నాళ్ళుగా నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ సర్వసంపదనంతటితో - అభినయించి నే పాడేదను
ఉండలేను - బ్రతుకలేను - నీతోడు లేకుండా - నీ నీడలేకుండా " ప్రేమే "
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో "2"
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా " ప్రేమే "
3. విధిరాసిన విషాదగీతం - సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి "2"
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్య " ప్రేమే "
English Lyrics :
Preme shaswathamaina parishuddhamaina podharillu
manase mandhiramaaye naa madhilo deepamu neeve "2"
ninnasrahinchina vaarini udhayinchu soorini valene
nirantharam nee maatatho prakashimpacheyudhuvu "2" " preme "
amaramaina nee cheritham vimalamina nee rudhiram
aathmiyamuga uthejaparichina pravarthanakshethram "2"
innalugaa nannu snehinchi inthaga phalimpajesithivi
ee sarvasampadhananthatitho abhinayinchi ney paadedhanu
undalenu brathukalenu neethodu lekunda nee needalekundaa " preme"
kammanaina nee upadeshamu vijayamiche shodhanalo
kadgamu kante balamaina vakyamu dhairyamiche naa sramalo "2"
karuvuseemalo sirulolikinchenu nee vakyapravahamu
gaganamu cheelchi moopaina dheevena varshamu kuripinchithivi
ghanamana nee karyamulu vivarimpa naa tharama varnimpa naa tharamaa " preme "
vidhiraasina vishadhageethamu samasipoye nee dhayatho
sambharamaina vagdhanamulatho natyamuga marchithivee "2"
mamathala vanthena dhaatinchi mahimalo sthanamichithivi
nee rajyamulo sresthulatho yuga yugamulu ney prakashinchanaa
naa paina endhukintha ghaadamaina prema neeku maruvalenu yesaiah " preme "
Track
ReplyDeleteNice song
ReplyDelete