Oneness (Mashup) Lyrics - Telugu Christian Song

Oneness

Click here to watch on Youtube.

Lyrics:

రాజుల రాజైన యేసు రాజు

భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా 

దేవుని స్తుతియించుడి

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి

బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి

ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి        "రాజుల రాజైన"


దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        "దేవుని"

ఆయన పరిశుద్ధ ఆలయమందు    "2"

ఆయన సన్నిధిలో ఆ… ఆ… "2"      "ఎల్లప్పుడు"


అల సైన్యములకు అధిపతియైన

ఆ దేవుని స్తుతించెదము    "2"

అల సంద్రములను దాటించిన

ఆ యెహోవాను స్తుతించెదము    "2"

హల్లెలూయ స్తుతి మహిమ

ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము    "2"

ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా    "2"


భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు        "2"

దేవుడు - దేవుడు - యేసె దేవుడు

తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ    

దేవుడు - దేవుడు - యేసె దేవుడు    

హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా        "2"


సూర్యునిలో చంద్రునిలో

తారలలో ఆకాశములో    "2"

మహిమా మహిమా ఆ యేసుకే

మహిమా మహిమా మన యేసుకే    "2"


యోర్దాను ఎదురైనా

ఎర్ర సంద్రము పొంగిపొర్లినా    "2"

భయము లేదు జయము మనదే    "2"

విజయ గీతము పాడెదము    "2"

హోసన్నా జయమే – హోసన్నా జయమే

హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే     "2"


బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు

శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము

సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు    "2"

అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు    "2"

నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు

నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు   "2"


పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా    "2"

సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా    "2"

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

యేసు నాథుని మేలులు తలంచి     "స్తోత్రం"


యేసు రాజుగా వచ్చుచున్నాడు

భూలోకమంతా తెలుసుకొంటారు    "2"

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు    "2"

రారాజుగా వచ్చు చున్నాడు    "2"    "యేసు"


స్తుతుల మధ్యలో నివాసం చేసి

దూతలెల్ల పొగడే దేవుడాయనే    "2"

వేడుచుండు భక్తుల స్వరము విని

దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే    "2"

ఆయనే నా సంగీతము బలమైన కోటయును

జీవాధిపతియు ఆయనే

జీవిత కాలమెల్ల స్తుతించెదము


సీయోను పాటలు సంతోషముగా

పాడుచు సీయోను వెల్లుదము    "2"

లోకాన శాశ్వతానందమేమియు

లేదని చెప్పెను ప్రియుడేసు    "2"

పొందవలె నీ లోకమునందు

కొంతకాలమెన్నో శ్రమలు    "2"


కష్టనష్టములెన్నున్నా

పొంగు సాగరాలెదురైనా

ఆయనే మన ఆశ్రయం

ఇరుకులో ఇబ్బందులలో

రండి యెహొవాను గూర్చి

ఉత్సాహగానము చేయుదము

ఆయనే మన పోషకుడు

నమ్మదగిన దేవుడని


కొండలలో లోయలలో

అడవులలో ఎడారులలో    "2"

నన్ను గమనించినావా

నన్ను నడిపించినావా    "2"

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నీవే నీవే నా రాజువయ్యా    "2"

యేసయ్య యేసయ్య యేసయ్యా…  "యేసయ్యా"


చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా

పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా   "2"

అద్వితీయుడు ఆదిదేవుడు

ఆదరించును ఆదుకొనును    "2"

ఓరన్న…  ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా

యేసే ఆ దైవం చూడన్నా 


నా దీపమును వెలిగించువాడు

నా చీకటిని వెలుగుగా చేయును    "2"

జలరాసులనుండి బలమైన చేతితో    "2"

వెలుపల చేర్చిన బలమైన దేవుడు    "2"

యెహోవా నా బలమా

యదార్థమైనది నీ మార్గం

పరిపూర్ణమైనది నీ మార్గం    "2"


గుండె చెదరిన వారిని బాగుచేయువాడని

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని  "2"

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది    "2"


దారుణ హింస లలో – దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో – ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో

సర్వత్ర యేసుని కీర్తింతుము    "2"

దేవుని వారసులం – ప్రేమ నివాసులము

జీవన యాత్రికులం – యేసుని దాసులము

నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

Comments

Popular posts from this blog

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu

Hosanna Ministries 2021 Songs Book

NYAYAADIPATHI | DIVYATHEJYOMAYA YESSAYYA SONG LYRICS IN TELUGU