Paravasini ney jagamuna prabhuva Song Lyrics

పరవాసిని నే

Click here to listen on Youtube.

Telugu Lyrics :

పరవాసిని నే జగమున ప్రభువా "2"

నడచుచున్నాను నీ దారిన్

నా గురి నీవే నా ప్రభువా "2"

నీ దరినే జేరెదను

నేను.. నీ దరినే జేరెదను       "పరవాసిని"


లోకమంతా నాదని యెంచి

బంధు మిత్రులే ప్రియులనుకొంటిని "2"

అంతయు మోసమేగా "2"

వ్యర్ధము సర్వమును

ఇలలో.. వ్యర్ధము సర్వమును      "పరవాసిని"


ధన సంపదలు గౌరవములు

దహించిపోవు నీలోకమున "2"

పాపము నిండె జగములో "2"

శాపము చేకూర్చుకొనే

లోకము.. శాపము చేకూర్చుకొనే     "పరవాసిని"


తెలుపుము నా అంతము నాకు

తెలుపుము నా ఆయువు యెంతో "2"

తెలుపుము ఎంత అల్పుడనో "2"

విరిగి నలిగియున్నాను

నేను.. విరిగి నలిగియున్నాను        "పరవాసిని"


ఆ దినము ప్రభు గుర్తెరిగితిని

నీ రక్తముచే మార్చబడితిని "2"

క్షమాపణ పొందితివనగా "2"

మహానందము కలిగే

నాలో.. మహానందము కలిగే        "పరవాసిని"


యాత్రికుడనై ఈ లోకములో

సిలువ మోయుచు సాగెదనిలలో "2"

అమూల్యమైన ధనముగా "2"

పొందితిని నేను

యేసునే.. పొందితిని నేను       "పరవాసిని"


నా నేత్రములు మూయబడగా

నాదు యాత్ర ముగియునిలలో "2"

చేరుదున్ పరలోక దేశము "2"

నాదు గానము ఇదియే

నిత్యము.. నాదు గానము ఇదియే       "పరవాసిని"


English Lyrics :

Paravaasini Ne Jagamuna Prabhuvaa "2"

Nadachuchunnaanu Nee Daarin

Naa Guri Neeve Naa Prabhuvaa "2"

Nee Darine Jeredanu

Nenu.. Nee Darine Jeredanu      "Paravaasini"


Lokamanthaa Naadani Yenchi

Bandhu Mithrule Priyulanukontini "2"

Anthayu Mosamegaa "2"

Vyardhamu Sarvamunu

Ilalo.. Vyardhamu Sarvamunu       "Paravaasini"


Dhana Sampadalu Gouravamulu

Dahinchipovu Neelokamuna "2"

Paapamu Ninde Jagamulo "2"

Shaapamu Chekoorchukone

Lokamu.. Shaapamu Chekoorchukone       "Paravaasini"


Thelupumu Naa Anthamu Naaku

Thelupumu Naa Aayuvu Yentho "2"

Thelupumu Yentha Alpudano "2"

Virigi Naligiyunnaanu

Nenu.. Virigi Naligiyunnaanu      "Paravaasini"


Aa Dinamu Prabhu Gurtherigithini

Nee Rakthamuche Maarchabadithini "2"

Kshamaapana Pondithivanagaa "2"

Mahaanandamu Kalige

Naalo.. Mahaanandamu Kalige        "Paravaasini"


Yaathrikudanai Ee Lokamulo

Siluva Moyuchu Saagedanilalo "2"

Amoolyamaina Dhanamugaa "2"

Pondithini Nenu

Yesune.. Pondithini Nenu       "Paravaasini"


Naa Nethramulu Mooyabadagaa

Naadu Yaathra Mugiyunilalo "2"

Cherudun Paraloka Deshamu "2"

Naadu Gaanamu Idiye

Nithyamu.. Naadu Gaanamu Idiye      "Paravaasini"

Comments

Popular posts from this blog

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

నీవే లేక ఏమవదునో | Neeve leka emavaduno 2026 Telugu Christian Song Lyrics

Krupa Kalugunu Gaka Lyrics – Jonah Samuel | New Telugu Christian Song 2026

Vimochana Kartha Na Yesayya Lyrics in Telugu & English