Prardhana Valane Payanam song Lyrics
నీ పాదాలు తడపకుండా
Click here to watch on Youtube.
ప్రార్ధన వలనే పయనము
ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము
ప్రార్ధన లేనిదే పరాజయం "ప్రార్ధన వలనే"
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా "2"
ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము "2"
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము "2" "ప్రార్ధన వలనే"
ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము "2"
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము "2" "ప్రార్ధన వలనే"
Comments
Post a Comment