Pattajaalanantha deevenalu song lyrics in Telugu
పట్టజాలనంత దీవెనలు
Click here to watch on YouTube.
Telugu Lyrics:
పట్టజాలనంత దీవెనలు - కుమ్మరించువాడవు
ఊహించలేని కార్యములు - చేయుచున్నవాడవు “2”
"పట్టజాలనంత"
ఇది ఆనందగీతము - నాది సంతోషగానము “2”
నీకే మహిమ - నీకే ఘనత -నీకే ప్రభావము “2”
అంచులో ఉన్న నన్ను - ఎంచుకున్నావు
నిత్యమైన నీ కృపతో - నీ వాత్సల్యము చూపావు “2”
పర్వతాలు తొలగిపోయినా - మెట్టలు తత్తరిల్లినా “2”
నీ కృప నన్ను విడిచిపోదయ్యా - నీ నిబంధన తొలిగిపోదయ్యా “2”
"పట్టజాలనంత"
సొమ్మసిల్లి ఉన్న నన్ను - లేవనెత్తియిన్నావు
బలమైన నీ శక్తితో - స్థిరపరిచి ఉన్నావు “2”
నాలో ధైర్యము కోల్పోయినా - ఒంటరిగా నేను మిగిలిన “2”
నీ చేయ్యి నన్ను విడిచిపోదయ్యా - నీతో ఉన్న బంధము విడవలేనయ్యా “2”
"పట్టజాలనంత"
Comments
Post a Comment