Unnavaadavu Anuvaadavu Neevu song Lyrics
వున్నవాడవు అనువాడవు నీవు
Telugu Lyrics :
వున్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా "2"
అల్ఫయూ... ఓమేగాయూ...నీవే కదా
ఆద్యంతా...రహితుడవు...నీవే కదా "2"
హల్లెలూయా స్తోత్రార్హుడా
యుగయుగములకూ స్తుతిపాత్రుడా "2" "వున్నవాడవు"
పలుకబడిన వాక్కుతో
ప్రపంచములు నిర్మించితివి...
మంటితో మము చేసి
జీవాత్మను ఊదితివి... "2"
మమ్మునెంతో ప్రేమించీ...
మహిమతో నింపితివి...
పరము నుండీ దిగివచ్చి...
మాతో నడచితివి... "అల్పయూ"
పాపమంటియున్న మాకై
మా పరమ వైద్యునిగా...
నీ రుధిరం నాకై కార్చి
ప్రాయశ్చిత్తం చేయగా..."2"
మొదటివాడా కడపటివాడా...
జీవింపచేసితివే...
నీదు ఆత్మతో నింపితివే...
మమ్ము సరిచేసితివే... "అల్ఫయూ"
ప్రతివాని మోకాలు
వంగును నీ నామమున...
ప్రతివాని నాలుక
చాటును నీ మహిమను..."2"
తరతరములకు మమ్మేలువాడా...
భూపతుల రాజువే...
మేఘారూడుడై దిగివచ్చి...
మహినేలు మహారాజువే... "అల్ఫాయు"
Comments
Post a Comment