Bajana cheyaga raarandi | భజన చేయగ రారండి song lyrics
భజన చేయగ రారండి
Click here to listen on YouTube.
Lyrics :
భజన చేయగ రారండి
భగవంతుని ఇల కనరండి
బేత్లెహేముకు ప్రభువుల ప్రభువు
దిగివచ్చెను ఆ దివి నుండి
సంతోషమే సౌభాగ్యమే
శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో
1.అంధకార లోకములోనికి
అందరి వెలుగై ఉదయించెన్
పాపియైన మనుష్యుని కొరకై
పాపము లేకయె జన్మించెన్
దేవాది దేవుని
కానుకగా వచ్చెన్
ప్రేమ ప్రవాహమై
నరులను రక్షింపన్
రారండి జనులారా
యేసుని కనరండి
2.దాసుని రూపము ధరియించి
మనుష్యుల పోలికగా పుట్టి
బదులుగా నిలిచినాడు
వ్యధను భరియించినాడు
దాసుని రూపము ధరియించి
మనుష్యుల పోలికగా పుట్టి
మార్గమై నడచినాడు
మరణమును గెలిచినాడు
సర్వశక్తుండేసు
రిక్తుడాయెను ఇలలో
దేవదేవునితో
సమమైయుండి “ సంతోషమే “
Comments
Post a Comment