Entho Anandamu | Christmas song lyrics in telugu

 పరమందు ఉన్న  దైవము


Click here to listen on YouTube.


Telugu Lyrics:

పరమందు ఉన్న  దైవము 

భువిపై దిగివచ్చినా వైనము “2”

జనులందరి రక్షణకై  దైవము 

దయచూపి చేసిన సంకల్పము  “2”


ఎంతో ఆనందము - నిత్య సంతోషము 

ఎంతో వైభోగము - క్రీస్తుని జననము  “2”


1. ప్రజలందరు పాపులై - దేవునికి దూరమై 

పాపం పరిపక్వమై - మరణం దరి చేరువై  “2”


పాపాన్ని క్షమియించుటకు - మరణాన్ని తొలగించుటకు

అందరినీ రక్షించుటకు - పరిశుద్ధత స్థాపించుటకు


దైవమే మనుష్యునిగా ఇలలో జన్మింపగా


ఎంతో ఆనందము - నిత్య సంతోషము 

ఎంతో వైభోగము - క్రీస్తుని జననము  “2” “పరమందు


2. ప్రజలందరు శుద్ధులై - పాపానికి దూరమై 

ప్రభు యేసుని శిష్యులై - లోకానికి వేడుకై “2”


క్రీస్తును ప్రకటించుటకు - క్రీస్తు ప్రేమ చూపించుటకు 

క్రీస్తు లా జీవించుటకు - పాపిని రక్షించుటకు


దైవమే మాదిరిగా ఇలలో జన్మించగా


ఎంతో ఆనందము - నిత్య సంతోషము 

ఎంతో వైభోగము - క్రీస్తుని జననము  “2” “పరమందు

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Hosanna Ministries 2021 Songs Book

Nenu odiponaya Song lyrics

స్థిరపరచువాడవు | Emaina Cheyagalavu Song lyrics