Sambaramenanta 2 song lyrics
ఊరు వాడ సంబరమేనంట
Click here to listen on YouTube.
Telugu Lyrics:
ఊరు వాడ సంబరమేనంట గుండెలనిండా సంతోషమంట "2"
యేసురాజు(3) పుట్టేనంట పాపుల రక్షకుడుదయించేనంట "2"
సంబరం సంబరం సంబరమేనంట "2"
1.యుదయా దేశమంట బేత్లెహేము గ్రామమంట ఎన్నికే లేనిదంట
యేసయ్య ఎన్నుకున్నాడంట "2"
దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట నరులందరిని రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట "2" "ఊరు వాడ”
2.తూర్పుదేశపు జ్ఞానులంట యేసుని చూడ వచ్చారంట బంగారు
సాంబ్రాణి బోళమును కానుకగా అర్పించారంట "2"
మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతియించారంట "2" "ఊరు వాడ”
Comments
Post a Comment