శతకోటి వందనాలు Shathakoti Vandhanalu Yessaya song lyrics
శతకోటి వందనాలు
Click here to watch on YouTube.
Telugu lyrics:
శతకోటి వందనాలు
నా యేసయ్యా
గతమంత నీ కృపలో
కాచితివయ్యా "2"
అ.ప:
నూతన బలము
నూతన శక్తి
మా కొసగుమయ్యా
ఎనలేని నీ ప్రేమను మాపై
చూపించుమయ్య "2" " శతకోటి వందనాలు "
1.శ్రమలు,శోధనలు
ఇరుకు,ఇబ్బందులు
ఎన్నెన్నో కలిగి
కన్నీరు విడిచిన "2"
కన్నీరు నాట్యముగ
మార్చివేసినావు
మాతోడు నీవై
నడిపించినావు "2"" నూతనబలము "
" శతకోటి వందనాలు "
2.ఆత్మీయ యాత్రలో
అలసిపోయిన
నీ శక్తితో నింపి బలపరచినావు "2"
పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి
ఆకాశవీధిలో విహరింపజేశావు "2"" నూతనబలము "
" శతకోటి వందనాలు
3.దినములు జరుగుచుండగ
నీ కార్యములు
నూతనపరచుము
నా యేసయ్యా "2"
ఈ సమయములో
మెండైన దీవెనలు
కురిపించుమయా
కృపగల దేవ "2"" నూతనబలము "
" శతకోటి వందనాలు "
Comments
Post a Comment