Peru maarindhi gani song lyrics
పేరు మారింది గానీ
Click here to listen the song.
పేరు మారింది గానీ.....
నీ తీరు మారలేదే....... "2"
పల్లవి:
పేరు మారింది గాని నీ తీరు మారలేదే "2"
విశ్వాసి ఓ విశ్వాసి "2"
నీ ఇంటిలోగాని నీ సంఘములోగాని
నీ ఊరులోగాని మంచి సాక్ష్యము నీకుందా "2"
"పేరు మారింది"
చరణం:1️⃣
నీవు భూతులు మానలేదు
నీవు భాషలు మానలేదు
నీవు ప్రార్ధన మానలేదు
నీవు పాపం మానలేదు "2"
నిజమైన భక్తి నీవు చేస్తున్నావో
నిలకడలేని భక్తి నీవు చేస్తున్నావో "2"
ఆలోచించుము నీవు ఆలోచించుము "2"
"పేరు మారింది"
చరణం:2️⃣
నీవు మందిరము మానలేదు
నీవు మందు మానలేదు
నీ మనస్సు మారలేదు
మంచి మనిషిగా మారలేదు "2"
మంచివాడిగా మనుషులను మెప్పిస్తున్నావో
దేవుని దృష్టిలో యధార్ధముగా ఉన్నావో "2"
ఆలోచించుము నీవు ఆలోచించుము "2"
"పేరు మారింది"
చరణం:3️⃣
నీవు పేరుకు క్రైస్తవుడవే
నీవు తీరుకు క్రైస్తవుడవే
మారు మనస్సు పొందావా
మాదిరిగా జీవిస్తున్నావా "2"
క్రీస్తు ప్రేమను కలిగి నీవు ఉన్నావో
క్రీస్తుని పోలి నీవు నడచుచున్నావో "2"
ఆలోచించుము నీవు ఆలోచించుము "2"
"పేరు మారింది"
Comments
Post a Comment