Sravya spadhanam | శ్రావ్యసదనము song lyrics
శ్రావ్యసదనము
Click here to listen on YouTube.
Telugu Lyrics:
నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీవే సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా “2”
నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1”
విరజిమ్మే నాపై కృప కిరణం
విరబూసే పరిమళమై కృప కమలం “2”
విశ్వాస యాత్రలో ఒంటరినై
విజయ కిరణము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నన్ను బలపరచి నడిపించే నా యేసయ్యా “1”
నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1”
నీ నీతి నీ రాజ్యం వేదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు “2”
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నన్ను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా “1”
నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము “1”
పరిశుద్ధత్మకు నిలయముగా
ఉపదేశముకు వినయముగా “2”
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “1” “నీవే శ్రావ్య సదనము”
Comments
Post a Comment