Nuthanamaina Krupa song lyrics
Nuthanamaina Krupa
Click here to listen on YouTube.
Telugu Lyrics:
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా....
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
నాక్రయధనముకై రుధిరము కాంతివి
ఫలవంతములైన తోటగా మార్చితివి
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
Comments
Post a Comment