Siluvalo Vreeladee ॥ సిలువలో వ్రేలాడే song lyrics in telugu
Click here to listen on YouTube.
Telugu Lyrics :
సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను పిలచుచుండే
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను పిలచుచుండే “2”
కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసి కృంగుచునే “2”
గాయములచే బాధనొంది
రక్తము కార్చే హింసనొంది “2” “సిలువలో”
నాలుక యెండెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని “2”
చేదు రసమును పానము చేసి
చేసెను జీవాయాగమును “2” “సిలువలో”
అగాధ సముద్ర జలములైన
నీ ప్రేమను ఆర్పజాలవుగా “2”
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధారాపోయుచుండే “2” “సిలువలో”
Comments
Post a Comment