సిలువలో బలియైన | Siluvaalo baliayna song lyrics

సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల


Telugu Lyrics: 



పల్లవి : సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల

విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు


1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి

కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే     “ సిలువలో “


2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి

నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా  “ సిలువలో “


3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత

సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా          “ సిలువలో “


4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి

తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి              “ సిలువలో “


5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి

మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా   “ సిలువలో “


6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే

మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా         “ సిలువలో “


7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై

పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ    “ సిలువలో “

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu