Viduvani yedabaayani prema needayya song lyrics

విడువని ఎడబాయని ప్రేమ నీదయా

పల్లవి :-

విడువని ఎడబాయని ప్రేమ నీదయా

కన్నతల్లి లాగ పలకరించె మనసు నీదయా (2)

ఏమివ్వగలనయ్య నీకు 

ఎనలేని కృప చూపినందుకు (2)

                                  "విడువని"


చరణం :-1️⃣

గురిలేని నా పయనంలో 

నీదరికి నన్ను పిలచినావయా (2)

నా బ్రతుకు మార్చి నీ జ్ఞానమిచ్చి  (2)

చిన్న గొర్రె పిల్లవలె

నన్ను నడుపుచుంటివి (2)

స్తోత్రాలు నీకే యేసయ్యా 

కోట్లాది స్తోత్రాలయా (2)

                                  "విడువని"


చరణం :-2️⃣

పడియుంటి శ్రమల కొలిమిలో

నీకుడి చేతితో పైకి లేపినావు (2)

నన్ను బలపరచి నన్ను దీవించి (2)

నా మంచి నేస్తమై 

నన్ను నడుపుచుంటివి (2)

వందనాలు నీకే యేసయ్యా

కోట్లాది వందనాలయ్యా  (2)

                                  "విడువని"


చరణం :-3️⃣

కృంగదీసె శోధనలెన్నో 

నా భుజము తట్టి అభయమిచ్చినావు  (2) 

నన్ను విడిపించి నన్ను బాగుచేసి  (2) 

నా మార్గదర్శివై నన్ను నడుపుచుంటివి (2)

స్తుతులు నీకే యేసయ్యా 

కోట్లాది స్తుతులు నీకయ్యా  (2)

                                  "విడువని"


చరణం :-4️⃣

రక్షణను ఇచ్చినావయ్యా

నీ సాక్షిగ నన్ను నిలిపినావయ్యా  (2) 

సంతోషమిచ్చి సమాధానమిచ్చి (2)

నీ ఆత్మ చేత నన్ను

ఇలలో నడుపుచుంటివి  (2)

హల్లెలూయ హల్లెలూయా

ఆరాధన  ఆరాధన

నీకే హల్లెలూయ హల్లెలూయా

ఆరాధన  ఆరాధన

                                  "విడువని"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Thandri deva Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book

Dhyaninchuchuntimi Song Lyrics