Siramu meeda mulla sakshiga | శిరము మీద ముళ్ల సాక్షిగా Song Lyrics in Telugu
శిరము మీద ముళ్ల సాక్షిగా
Click here to Listen on Youtube.
Telugu Lyrics:
శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా “2”
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు “3”
సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని “2”
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ “శిరము”
మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని “2”
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి “శిరము”
Comments
Post a Comment