Dunnani Beedu Bhoomulalo Song Lyrics



Click here to listen on YouTube.

దున్నని బీడు భూములలో

Telugu Lyrics :

నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ 

చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా “2”

దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో 

రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో “2”


ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా 

నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య “2”

పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా 

నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా  “2”. “దున్నని”


ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా 

ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా “2”

కష్టము లేక సుఖముగా వచ్చే -  ఫలమే వద్దయ్యా 

కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా  “2”.  “దున్నని”


ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా 

స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా  “2”

నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా 

మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా  “2”  “దున్నని”

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025