యేసుని జననం | Yesuni Jananam Song lyrics
యేసుని జననం
Click here to listen on YouTube.
Telugu Lyrics :
Verse-1
రాజులకే రారాజువు లోకానికి వెలుగై ఉదయించెను
సింహాసనముపై ఆశీనుడు సామాన్యుడిగా దిగివచ్చెను “2”
సర్వోన్నతుని కుమారుడు - సర్వజనులకు రక్షకుడు “2”
Chorus
ఓహో ఆనందమే సంతోషమే
శ్రీ యేసుని జననం అద్భుతమే “2”
మేము సాగిలపడి నిన్నే సేవింతుము
మేము సాగిలపడి నిన్నే పూజింతుము “2”
Verse-2
మన పాపభారం తొలగింపను ఈ భూవికే రక్షణ తెచ్చెను
విడువని కృపతో ప్రేమించెను శాశ్వత జీవం మనకిచ్చేను “2”
ఇమ్మానుయేలుగా ఉదయించె
మాతోడుగా నిత్యముండును “2”
Bridge-1
నీ నామమెంతో ఉన్నతం
నీ వాగ్ధానములు శాశ్వతం
నీ ప్రేమయే నిరంతరం
యేసయ్య..... యేసయ్య...
Bridge-2
నీ వాక్యమెంతో మధురం
నీ కార్యములు ఆశ్చర్యములు
నీ రాజ్యమే నిరంతరం
యేసయ్య..... యేసయ్య.....
Chorus-2
ఓహో ఆనందమే సంతోషమే
శ్రీ యేసుని జననం అద్భుతమే “2”
మేము సాగిలపడి నిన్నే సేవింతుము
మేము సాగిలపడి నిన్నే పూజింతుము “2”
Comments
Post a Comment