కృప లేక నేను | Krupa Leka Nenu

కృప లేక నేను



Click here to listen on YouTube.

Telugu Lyrics:

కృప లేక నేను జీవించలేను

కృప లేని నన్ను ఊహించలేను

కృపలోనే నేను మునిగియున్నాను

కృపలోనే నేను తేలుతున్నాను

కృపనే శ్వాసగా జీవిస్తున్నాను

కృప వెంట కృప నేను పొందుతున్నా!

మహిమ నుండి మహిమలోకి గెంతుతున్నా! (దూకుతున్నా)   

                                         

1. ప్రేమతో ప్రభు నాకిచ్చాడుగా - తన స్వరూపము, తన పోలిక -           కృప... కృప...

పాపములో నే పడియుండగా - నను మధ్యలో వదిలేయ్ లేదుగా -           కృప... కృప...

శత్రువునైయున్న నా కోసము దివినుండి భువికొచ్చెగా!

నను తప్పింపను నా బదులుగా తానే బలైనాడుగా! 

కృపలోనే నన్ను కలుసుకున్నాడు

కృపతోనే నన్ను కౌగలించినాడు

కృపతోనే ప్రభు నన్ను ముద్దాడినాడు 


2. నే పొందిన ఈ ఘన రక్షణ – నా క్రియ మూలముగా కాదుగా!           కృప... కృప...

రక్షణ దేవుని వరమే కదా! నీతి దానం ఉచితం కదా!             కృప... కృప...

సత్ క్రియలు నా చేత చేయించును – నే పొందిన ఈ కృప!

ప్రయాసపడుతుంది నే కాదుగా – నాకున్న దేవుని కృప!

కృపతోనే నేను నిండియున్నాను

కృపలోనే నేను ఎదుగుచున్నాను

కృపలోనే  అభివృద్ధి పొందుతూ ఉన్నాను


3. పాపమునకు నాపై ఉండిన – ప్రభుత్వమును కొట్టివేసిందిగా!           కృప... కృప...

పాపపు క్రియలు అన్నింటిని – అసహ్యింపగ నను మార్చిందిగా!           కృప... కృప...

ఇహలోక సంబంధ దురాశను విసర్జింప నేర్పిందిగా! 

సద్భక్తి నీతి స్వస్థబుద్దితో బ్రతుకుటకు బోధించెగా!

కృపను నేను వ్యర్ధపరచను

కృపలోనే నేను నిలిచియుందును

కృప మహిమకే కీర్తి చెల్లిస్తున్నాను


4. నను బాధించెడి ప్రతి ముల్లును అధిగమించేందుకు ప్రభువిచ్చెను -           కృప... కృప...

బలహీనతలో ప్రభు శక్తిని పరిపూర్ణము నాలో చేయించును -             కృప... కృప...

బలహీనతలో మరియెక్కువ హర్షిస్తా కృప ఉందని

నేనేమైయున్నానో అది దేవుని కృప వలనే అయియుంటిని

కృపలోనే నేను బలవంతుడను

కృపలోనే నేను ధనవంతుడను 

కృపను చూచి నే సంతోషిస్తున్నాను


5. నాకివ్వబడిన కృప చొప్పున కృపావరములను కలిగుంటిని            కృప... కృప...

దేవుని కృపావరము చొప్పున సువార్తకు పరిచారకుడైతిని             కృప... కృప...

నానావిధమైన కృప విషయమై గృహనిర్వాహకుడైతిని! 

కృపకు మరి కృపావాక్యానికే అప్పగింపబడితిని!

కృపతోనే నన్ను పిలిచియున్నాడు

కృపలొనే నన్ను ఏర్పరచినాడు

కృపావాక్యమునకు సాక్షిగా చేశాడు


6. అనుదినము కృప పొందేందుకు - చేరెద దేవుని కృపాసనం           కృప... కృప...

కృపను బట్టియే నా హృదయము - స్థిరపరచుకొనెద అనునిత్యము      కృప... కృప...

దేవుని ప్రతి ఒక్క వాగ్దానము కృపననుసరించే గదా!

శుభప్రదమైయున్న నిరీక్షణ - కృప నాకు యిచ్చిందిగా!

కృపయే నాకు నిత్యాదరణ

కృపయే నాకు నిత్య రక్షణ

కృప అంటే ఎవరో కాదు నా యేసు ప్రభువే!

Comments

Popular posts from this blog

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu

Hosanna Ministries 2021 Songs Book

NYAYAADIPATHI | DIVYATHEJYOMAYA YESSAYYA SONG LYRICS IN TELUGU