ఓ దైవమా | O DHAIVAMA SONG LYRICS | Joshua Shaik
ఓ దైవమా
Click here to listen on YouTube.
Telugu Lyrics:
ఓ దైవమా నీవే నా ప్రాణమా
నా జీవమా నీవే ఆధారమా
నీ ప్రేమతో నన్ను లాలించుమా
నీ మాటతో నన్ను పాలించుమా
ఆలించుమా - నా దైవమా - నా యేసయ్య
నీ సందేశమే - నా ప్రేరణై
నా సంతోషమే - నీ ధ్యానమై
యెదలో - మెదిలే - రాగమా
నా దైవమా - దరిచేరుమా - చిరుగాలిలా - నను తాకుమా
మదిలో నిండుగా - కొలువైనావుగా
ఇలలో తోడుగా - నడిపించావుగా
నీదు ప్రేమతో - యేసయ్య
నే చేరానుగా - నీ పాదమే
నా ఆరాధన - నీ కోసమే
కనులే - వెదికే - రూపమా
నా దైవమా - నను కావుమా - తొలిమంచులా - నను తాకుమా
మమతే పంచగా - కొరతే లేదుగా
ఋణమే తీరునా - వరమైనావుగా
నీదు ప్రేమతో - యేసయ్య
Comments
Post a Comment