Jaya Sankethama Song Lyrics
జయ సంకేతమా
Click here to listen on YouTube.
Telugu Lyrics:
జయ సంకేతమా దయా క్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్య “2”
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు “2”
నడిపించే నీ ప్రేమ పిలుపు “జయ సంకేతమా”
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే “2”
నన్నెలా ప్రేమించ మన సాయేను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదలా
నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేదా నా యాజమానుడా “2” “జయ సంకేతమా”
నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే “2”
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా “2” “జయ సంకేతమా”
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమీది “2”
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా “జయ సంకేతమా”
Comments
Post a Comment