Kurisindhi Tholakari Vaana Song Lyrics | Hosanna Ministries 2025
కురిసింది తొలకరి వాన
Click here to watch on YouTube
Telugu Lyrics:
కురిసింది తొలకరి వాన- నాగుండెలోనా
చిరుజల్లులా ఉపదేశపై నీ వాక్యమే వర్షమై
నీ నిత్య కృపయే నీ దయయే హెర్మోను మంచువలె పొంగిపొరలి ప్రవహించె నాజీవితాన..
ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా "కురిసింది"
1. ధూలినై పాడైన ఎడారిగా నను చేయకా
జీవజల ఊటలు ప్రవహింపజేసావు
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
సాక్షి మెఘపై నిరీక్షణగా నిలిచావు
స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా "పొంగి పొరలి"
2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
నా చీలమండలమునకు సౌందర్యమిచ్చితివి
నీ సన్నిధిలో నిలిచే భాగ్యమే కోల్పోనీయక
నీ ప్రభావమేఘముతో సాక్షిగా నను నడిపితివి
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమసాగరా “పొంగి పొరలి"
3. నా తొలకరి వర్షము నీవై చిగురింపచేశావు
నా ఆశల ఊహలలో విహరింపచేశావు
నా కడవరి వర్షము నీవై ఫలియింపచేశావు
నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు
హర్షద్వనులతో హర్షించెదను కరుణాసాగర... "పొంగి పొరలి"
Comments
Post a Comment