Posts

Showing posts from December, 2025

JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu

JALARI PANDUGA | జాలరి పండుగ  Click here  to listen on YouTube. Telugu Lyrics:  రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా “2” మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా    “2” ఉన్నా వాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్య     “2” 1వ చరణం: చేపలు పట్టే జాలరివి    - చదువే రాని పామరుని మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు    “2” నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు మహిమల రాజ్యము దారి చూపే మనసును    నిమ్మలపరచావు    “2” కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా     “2” ఉన్నా వాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్య    “2” 2వ చరణం: చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు    “2” నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు  బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు     “2” కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా...

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

రక్షకుని జన్మస్థలమా Click here to watch on YouTube. Telugu Lyrics:  రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా “2”  ఆరాధనకు ఆరంభమా హృదయర్పణలకు నివాసమా “2” ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీకోసము “2 స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును “2” “రక్షకుని జన్మస్థలమా” 1. ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మ నివ్వాలని”2” తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రార్థించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా”2”    “స్తుతియు మహిమ ప్రభావము” 2. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో “2” నీ చరిత్రనుమార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు”2” “స్తుతియు మహిమ ప్రభావము” 3. దివిలోని దూతగణములు సైన్య సముహమై దిగివచ్చిరి సర్వశక్తి సంపనన్నునికి స్తోత్రం గీతమే అర్పించిరి “2” సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించెనుగా”2” “స్తుతియు మహిమ ప్రభావము” 4. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజులగుమ్మము...