JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu

JALARI PANDUGA | జాలరి పండుగ 



Click here to listen on YouTube.

Telugu Lyrics: 


రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా “2”

మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు

మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు


కన్న వాటిని మరి విన్నవాటిని

చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా  “2”

ఉన్నా వాడవు నీవే మాకు

అన్ని వేళల అండవు నీవేనయ్య   “2”


1వ చరణం:

చేపలు పట్టే జాలరివి  - చదువే రాని పామరుని

మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు  “2”


నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు

మహిమల రాజ్యము దారి చూపే మనసును  నిమ్మలపరచావు  “2”


కన్న వాటిని మరి విన్నవాటిని

చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా   “2”

ఉన్నా వాడవు నీవే మాకు

అన్ని వేళల అండవు నీవేనయ్య  “2”


2వ చరణం:

చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని

లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు  “2”


నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు 

బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు   “2”


కన్న వాటిని మరి విన్నవాటిని

చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ  “2”

ఉన్నా వాడవు నీవే మాకు

అన్ని వేళల అండవు నీవేనయ్య  “2”


3వ చరణం:

అద్దరికి పోవ చూచితిని - దోనెను నేను ఎక్కితిని

త్రోవలో తుఫాను తాకిడికి - తల్లడిల్లి పోతిని   “2”


బూతమని భయపడితిని  - నేనే భయపడకంటివి 

 దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని   “2”


కన్న వాటిని మరి విన్నవాటిని

చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ  “2”

ఉన్నా వాడవు నీవే మాకు

అన్ని వేళల అండవు నీవేనయ్య  “2”


ఓ ఓ ఓ - ఓ ఓ ఓ

ఓ ఓ ఓ - ఓ ఓ ఓ



Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva