Posts

Showing posts from July, 2026

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

Image
Kolponayya Neepai Naa Nammakamunu (కోల్పోనయ్యా నీపై నా నమ్మకమును) 📺 Click here to listen on Youtube Telugu Lyrics : కోల్పోనయ్యా నీపై నా నమ్మకమును కోల్పోనయ్యా కోల్పోనయ్యా నీపై నా విశ్వాసమును కోల్పోనయ్యా గాలిని చూసి భయపడి మునిగిన పేతురు వలెను మునిగిపోనయ్యా ఆత్మకు విశ్వాసము పెంచే నీ ఉపదేశమానందం నాలో అభయము కలిగించే నీ వాక్యమే అతిమధురం నీనెవే ప్రజలు దోషము చేసిరి ప్రవక్త గద్దింపునకు లోబడిపోయిరి విశ్వాసముంచి ఉపవాస ప్రార్ధనతో దేవుని ఉగ్రత నుండి విడుదలను పొందిరి ఆనందం పొందెను "ఆత్మతో" పన్నెండేండ్ల యీడు గల ఒక్కతే కుమార్తె మరణముతో పోరాడి తుది శ్వాస విడిచెను యాయీరు వెంటనే యేసునాశ్రయించెను తన ఇంటి దుఃఖమును నాట్యముగా మార్చెను జీవమును పొందెను "ఆత్మలో" ఆస్థిని పిల్లలను కోల్పోయిననూ నీ యందలి విశ్వాసముతో ధైర్యము పొందెను యోబు వంటి సహనమును దానము చేయుము సాతానుకు నన్ను గూర్చిన సాక్ష్యమును చెప్పుము సాక్షినైయుందును "ఆత్మలో" English Lyrics : Kolponayya neepai naa nammakamunu kolponayya Kolponayya neepai naa viswasamunu kolponayya Gaalini choosi bhayapadi munig...

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Nenemaiunnano Nee Krupa (నేనేమైయున్నానో నీ కృపయే) పల్లవి: అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే "2" కృపయే… కృపయే… నేనేమైయున్నానో నీ కృపయే కృపయే… కృపయే… నే బ్రతికియున్నానంటే కృపయే "2" "అర్హత లేకున్నా" చరణం 1: లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే "2" ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్యా "2" నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను "2" "కృపయే కృపయే" చరణం 2: శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేతే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే "2" ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటివాడను యేసయ్యా "2" నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను "2" "కృపయే కృపయే" E nglish Lyrics : Arhatha lekunna preminchavu Idhi kevalam nee krupaye Yogyatha lekunna hecchinchavu Idhi kevalam nee krupaye "2" Krupaye… krupaye… Nenemaiyunnano nee krupaye Krupaye… kru...

Deva Ee Jeevitham Lyrics in Telugu & English | Powerful Telugu Worship Song

"Deva Ee Jeevitham Neekankitham" (దేవా ఈ జీవితం నీకంకితం) 📺 Click here to listen on Youtube Telugu Lyrics : దేవా ఈ జీవితం... నీకంకితం "2" ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం "2" "దేవా" నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు "2" నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను "2"  "ఎన్ని" నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై నీ వాక్యమే నను నడిపెనూ "2" నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను "2"  "ఎన్ని" "దేవా" English Lyrics : Deva ee jeevitham... neekankitham "2" Enni kashtalaina enni nashtalaina Neethone naa jeevitham Vyadhi baadhalaina shoka sandramaina Neethone naa jeevitham "2" "Deva" Nee premanu choopinchi – nee kougitilo cherchi Nee maargamune naaku choopinaavu "2" Neethone nadachi – neelone jeevinchi Neethone saagedan...