Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics
రక్షకుని జన్మస్థలమా
Telugu Lyrics:
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా “2”
ఆరాధనకు ఆరంభమా హృదయర్పణలకు నివాసమా “2”
ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీకోసము “2
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును “2” “రక్షకుని జన్మస్థలమా”
1. ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మ నివ్వాలని”2”
తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రార్థించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా”2” “స్తుతియు మహిమ ప్రభావము”
2. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో “2”
నీ చరిత్రనుమార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు”2” “స్తుతియు మహిమ ప్రభావము”
3. దివిలోని దూతగణములు సైన్య సముహమై దిగివచ్చిరి సర్వశక్తి సంపనన్నునికి స్తోత్రం గీతమే అర్పించిరి “2”
సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించెనుగా”2” “స్తుతియు మహిమ ప్రభావము”
4. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు”2”
సింహ సంపన్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా శిరమువంచి శ్రీమంతునికి సాటిలేరని కొలిచిరిగా “2” “స్తుతియు మహిమ ప్రభావము”
Comments
Post a Comment