Neeve Hrudaya Saradhi Pragathiki vaaradhi song Lyrics
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే " నీవే హృదయ "
2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నామంచి కాపరి " నీవే హృదయ "
3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా " నీవే హృదయ "
Comments
Post a Comment