కృపగల దేవా Song Lyrics
Lyrics in Telugu :
కృపగల దేవా దయగల రాజా - చేరితి నిన్నే బహుఘనతేజ
నీ చరణములే నే కోరితిని - నీ వరములనే నే వేడితిని
సర్వాధికారి నీవే దేవా - నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి - ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా
1: త్రోవను చూపే తారవు నీవే - గమ్యము చేర్చే సారధి నీవే
జీవనయాత్ర శుభప్రదమాయే - నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము - నా హృదిని నీ శాంతితో నింపుము " కృపగల "
2: కృప చూపి నన్ను అభిషేకించి - వాగ్దానములు నెరవేర్చినావే
బహు వింతగా నను ప్రేమించినావే - బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును - నీ దివ్యమహిమలను ప్రకటింతును " కృపగల "
3: నా యేసురాజ వరుడైన దేవా - మేఘాల మీద దిగివచ్చువేళ
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో - ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో - జీవింతు నీలోనే యుగయుగములు " కృపగల "
Lyrics in English :
Krupagala Deva dayagala raja - cherithi ninne bahuganateja
nee cheranamule ney korithini - nee varamulane ney vedithini
sarvadhikaari neeve deva - naa sahakaari neeve prabhuva
naa korikale saphalamu chesi - alochanale neraverchithivi
arpinchedanu naa sarvamunu neeke deva
aaradhinchi aanandhincheda neelo devaa
1: throvanu chupi thaaravu neeve - gamyamu cherche saaradhi neeve
jeevanayathra shubhapradhamaaye - naa prathi pradhana parimalamaaye
nee udayakaanthilo nannu nadupumu - naa hrudhini nee shanthitho nimpumu "krupagala"
2: krupachupi nannu abhishekinchi - vagdhanamulu neraverchinaave
bahu vinthagaa nannu preminchinaave - balamaina janamugaa nannu maarchinaave
nee keerthi jagamantha vivarinthunu - nee divyamahimanu prakatinthunu "krupagala"
3: naa yesu raja varudaina deva - meghala meeda dhigi vachu vela
aakashaveedilo kamaniya kanthilo - priyamaina sanghamai ninu cheredhanu
nilichedanu neethone siyonulo - jeevinthu neelone yugayugamulu "krupagala"
Wonderful song
ReplyDeleteThanks for the blog annayya,, MAY GOD BLESS YOU.. Add more spiritual content..
ReplyDeleteThanks bro !
DeleteDefinitely, I'll publish more content...