Geetham Geetham Jaya Jaya Geetham Song Lyrics
గీతం గీతం
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2) " గీతం"
చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు " గీతం"
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి " గీతం"
అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి " గీతం"
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి " గీతం"
English Lyrics :
Geetham Geetham Jaya Jaya Geetham
Cheyyi Thatti Paadedamu (2)
Yesu Raaju Lechenu Hallelooyaa
Jaya Maarbhatinchedhamu (2) " Geetham "
Choodu Samaadhini Moosina Raayi
Doralimpabadenu
Andu Vesina Mudra Kaavali Nilchenu
Daiva Suthuni Mundu || Geetham ||
Valadu Valadu Aeduva Valadu
Velludi Galilayaku
Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu
Parugidi Prakatinchudi " Geetham "
Anna Kayapa Vaarala Sabhayu
Adaruchu Parugidiri
Inka Dootha Ganamula Dhvanini Vinuchu
Vanakuchu Bhayapadiri " Geetham "
Gummamul Therachi Chakkaga Naduvudi
Jaya Veerudu Raagaa
Mee Mela Thaalla Vaadyamul Boora
Letthi Dhvaninchudi " Geetham "
Comments
Post a Comment