Nannu gannaya raave song lyrics

నన్ను గన్నయ్య రావె నా యేసు 

Telugu Lyrics : 


నన్ను గన్నయ్య రావె నా యేసు 

నన్ను గన్నయ్య రావె నా ప్రభువా


ముందు నీ పాదారవిందము 

లందు నిశ్చల భక్తి ప్రేమను "2"

పొందికగా జేయరావే నా 

డెందమానంద మనంతమైయుప్పొంగ  "నన్ను"


హద్దులేనట్టి దురాశల

నవివేకినై కూడి యాడితి "2"

మొద్దులతో నింక కూటమి 

వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి  "నన్ను"


కాలము పెక్కు గతించెను 

గర్వాదు లెడదెగవాయెను "2"

ఈ లోకమాయ సుఖేచ్ఛలు 

చాలును జాలును జాలు నోతండ్రి  "నన్ను"


దారుణ సంసార వారధి 

దరి జూపి ప్రోవ నీ కన్నను "2"

కారణ గురువు లింకెవ్వరు 

లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి  "నన్ను"


నా వంటి దుష్కర్మ జీవిని 

కేవలమగు నీదు పేర్మిని "2"

దీవించి రక్షింపనిప్పుడే 

రావయ్య రావయ్య రావయ్య తండ్రి  "నన్ను"


English Lyrics : 


Nannu Gannayya Raave Naa Yesu

Nannu Gannayya Raave Naa Prabhuvaa "Nannu"


Mundu Nee Paadaaravindamu

Landu Nischala Bhakthi Premanu  "2"

Pondikagaa Jeyaraave Naa

Dendamaananda Mananthamai Yupponga "Nannu"


Haddu Lenatti Duraashala

Navivekinai Koodi Yaadithi  "2"

Moddulatho Ninka Kootami

Vaddayya Vaddayya Vaddayya Thandri "Nannu"


Kaalamu Pekku Gathinchenu

Garvaadu Ledadhegavaayenu  "2"

Ee Loka Maaya Sukhechchalu

Chaalunu Jaalunu Jaalu-no Thandri "Nannu"


Daaruna Samsaara Vaaradhi

Dari Joopi Prova Nee Kannanu  "2"

Kaarana Guruvu Linkevvaru

Lerayya Lerayya Lerayya Thandri "Nannu"


Naa Vanti Dushkarma Jeevini

Kevalamagu Needu Permini  "2"

Deevinchi Rakshimpanippude

Raavayya Raavayya Raavayya Thandri "Nannu"


Click here to listen on YouTube.


Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book