Gathakaalamantha Nee needalona song Lyrics
గతకాలమంత
Click here to watch on Youtube,
Telugu Lyrics :
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
కృప చూపినావు -కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన "2"
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా "2" "గతకాలమంత "
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము "2"
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా "2" "గతకాలమంత "
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట "2"
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా "2" "గతకాలమంత "
వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా "2"
Comments
Post a Comment