Nee Krupa Nenemaina song Lyrics

నీకృప నేనేమైనా


Click here to watch on Youtube.


Telugu Lyrics :

నీకృప నేనేమైనా...

నీ కృప నాకేమైనా ...

నీ కృప నీతో ఉన్నా...

నీ కృప నేనిల ఉన్నా...

ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా "2"

ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....


ఆరాధించెదనయ్య

నీ సన్నిధి చేరెదనయ్య #4#*

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా                    "  నీకృప నేనేమైనా  "


ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను

నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను  "2"

అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..

చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ... "2"


ఆరాధించెదనయ్య

నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను  "4"

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా                     "  నీకృప నేనేమైనా  "


పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను

పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను "2"

అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...

పరము విడిచి ప్రాణము పెట్టెను  నీ కృప.. "2"


ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య "4"

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..                     "  నీకృప నేనేమైనా  "


బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నేను మరిచినా

నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా "2"

అయినను నా చేయి పట్టెను... నీ కృపా..

నడిపించి నను గెలిపించినది నీ కృప "2"


ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య "4"

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...


Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu