Yesu Kosame | యేసు కోసమే song lyrics in telugu

యేసు కోసమే


click here to watch on Youtube.

TELUGU LYRICS:

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం

యేసుని పోలి నడిచే సాక్షులం 

యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం 

లోకములో యేసుని ప్రతినిధులం

శోధనలెదురైనా అవరోధములెన్నున్న

విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు

ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా

లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా


నిందారహితులుగా జీవించుట మన పిలుపు

నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు

యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము

లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే

ప్రేమయు సహనము యేసుని హృదయము

కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము        "యేసు కోసమే"


యేసు స్వభామును ధరించిన వారలము

మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము

సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను

రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము

రాజులు జనములు యేసుని చూచెదరు

విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు        "యేసు కోసమే"

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book