దీవించావే || Deevinchave samruddiga song lyrics

 దీవించావే 

Click here to listen on Youtube.


Telugu Lyrics :

    దీవించావే సమృద్ధిగా

    నీ సాక్షిగా కొనసాగమని

    ప్రేమించావే నను ప్రాణంగా

    నీ కోసమే నను బ్రతకమని


    దారులలో.. ఏడారులలో..

    సెలయేరులై ప్రవహించుమయా..

    చీకటిలో.. కారు చీకటిలో..

    అగ్ని స్తంభమై నను నడుపుమయా..               "దీవించావే సమృద్ధిగా"


1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా

    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా 

    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే

    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే   "2"

    ఊహలలో.. నా ఊసులలో..

    నా ధ్యాస బాసవైనావే..

    శుద్ధతలో.. పరిశుద్ధతలో..

    నిను పోలి నన్నిల సాగమని..             "దీవించావే సమృద్ధిగా"


2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా

    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా

    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా

    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా   "2"

    ఆశలలో.. నిరాశలలో..

    నేనున్నా నీకని అన్నావే..

    పోరులలో.. పోరాటములో..

    నా పక్షముగానే నిలిచావే..              "దీవించావే సమృద్ధిగా"

Comments

Post a Comment

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book