Daivaathmaa rammu song lyrics
దైవాత్మ రమ్ము
Click here to listen on YouTube.
Telugu lyrics :
దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము “2”
నా జీవమంతయు నీతోనుండ - జేరి వసింపుము “2” “దైవాత్మ”
స్వంతబుద్ధితోను - యేసుప్రభుని నెరుగలేను “2”
నే నెంతగ నాలోచించిన విభుని - నెరిగి చూడలేను “2” “దైవాత్మ”
స్వంతశక్తితోను - యేసు - స్వామి జేరలేను “2”
నే నెంతనడచిన ప్రభుని కలిసికొని – చెంతజేరలేను “2” “దైవాత్మ”
పాప స్థలమునుండి - నీ సువార్త కడకు నన్ను “2”
భువిలో పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు “2” “దైవాత్మ”
పాపములో మరల - నన్ను పడకుండగ జేసి “2”
ఆ నీ పరిశుద్ధమైన రెక్కల నీడను – కాపాడు “2” “దైవాత్మ”
పరిశుద్ధునిజేసి - నీ వరములు దయచేసి “2”
నీ పరిశుద్ధ సన్నిధి జూపుమ - పావురమా వినుమా “2” “దైవాత్మ”
తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు “2”
నీ కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు “2” “దైవాత్మ”
నన్నును భక్తులను - యేనాడును కృపతోను “2”
నిల మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవా “2” “దైవాత్మ”
వందనములు నీకు - శుభ వందనములు నీకు “2”
ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు “2” “దైవాత్మ”
Comments
Post a Comment