Krupae Kadha Telugu Christian Song Lyrics – Pastor Sagar | God’s Grace Worship Song
కృపయే కదా ఇది కృపయే కదా
Telugu lyrics :
బహు గొప్పదయ్యా నీ కనికరం
నాపై ఉదయించె నిరంతరం
బలపరచెనయ్యా నీ మాటలే కృంగిన ప్రతి వేళలో
విడువక నన్ను ప్రేమించగా
మదిలో నిండెను నీ రూపమే
మానక నా యెడల కృప చూపగా పొంగెను నాలో ఓ వెల్లువ
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్య ఇది కృపయేనయ్య “2”
1.నా శక్తి కాదయ్య నీ కృపయేనయ్య
నను నిలిపినది నేటి వరకు
కరుణించినావయ్య హెచ్చించినావయ్య
శత్రువులెదుటే దీవించినావయ్య “2”
నీవే లేని నేను లేనే లేను యేసయ్య
నీ కృప లేని నా బ్రతుకే ఊహకు కూడా అందదయ్య
ఊహకు కూడా అందదయ్య
“కృపయే”
2.గుండె పగిలి ఏడ్చితిని
నిరాశలో నిలిచితిని
నా కన్న తండ్రివై నను హత్తుకొంటివి
నా బలహీనతలో నాతో ఉన్నావే
నీ కృప నాకు చాలునన్నావే “2”
నాతో ఎవరు లేకున్నా నీ వుంటే నాకు చాలునయ్య
సర్వం నేను కొల్పోయినా సమకూర్చెదవు నీ మహిమలో
సమకూర్చెదవు నీ మహిమలో
“కృపయే”
3.నమ్మదగిన వారెవరూ ప్రేమించేవారెవరూ
ఒంటరైన వేళలో నిలిచింది ఎవ్వరూ?
నిలువెల్ల విషమేగా మాటలేమో ప్రేమగా
ఇహలోక బంధాలన్ని మాలిన్యమేగా “2”
ఈ భీకరమైన లోకంలో నా చేయి విడువను అన్నావే
శిధిలము కాని రాజ్యముకై శిల్పకారుడా నను చెక్కితివే
శిల్పకారుడా నను చెక్కితివే
“కృపయే”
English lyrics :
Bahu goppadayyaa nee kanikaram
Naapai udayinche nirantaram
Balaparachenayyaa nee maatale krungina prati velalo
Viduvaka nannu preminchagaa
Madilo nindenu nee roopame
Maanaka naa yedala krupa choopagaa pongenu naalo oo velluva
Krupaye kadaa idi krupaye kadaa
Krupayenayyaa idi krupayenayyaa “2”
1.Naa shakti kaadayyaa nee krupayenayyaa
Nanu nilipinadi neti varaku
Karuninchaavayyaa hechchinchaavayyaa
Shatruvuleduṭe deevinchinchaavayyaa “2”
Neeve leni nenu lene lenu Yesayyaa
Nee krupa leni naa bratuke oohaku kooda andadayyaa
Oohaku kooda andadayyaa
“Krupaye”
2.Gunde pagili edchitini
Niraashalo nilichitini
Naa kanna tandrivai nanu hattukontivi
Naa balahinatalo naato unnaave
Nee krupa naaku chaalunannaave “2”
Naato evaru lekunnā nee unte naaku chaalunayyaa
Sarvam nenu kolpoyinaa samakoorchedavu nee mahimalo
Samakoorchedavu nee mahimalo
“Krupaye”
3.Nammadagina vaarevvaroo preminchevaarevvaroo
Ontaraina velalo nilichindi evaroo?
Niluvella vishamegaa maatalemo premagaa
Ihaloka bandhaalannee malinyamegaa “2”
Ee bheekaramaina lokamulo naa cheyi viduvanu annaave
Shidhilamu kaani raajyamukai shilpakaarudaa nanu chekkitive
Shilpakaarudaa nanu chekkitive
“Krupaye”
Song Name: Krupae Kadha
Language: Telugu
Category: Worship Song
Theme: God’s Grace
Credits:
Lyrics, Tune & Vocals – Pastor Sagar
Music – Immi Johnson
Message:
A song that proclaims God’s grace as the foundation of life, strength, and restoration, reminding us that everything we have is only by His mercy.
Comments
Post a Comment