అబ్రహాము నమ్మిన దేవుడా | Christian Worship Song Lyrics | Hosanna Ministries 2026 Songs

ఇశ్రాయేలు కాపరి - Israel kaapari ॥ #hosannaministries 2026 New Album Pas.RAMESH Anna


Click here to listen on YouTube.


Telugu Lyrics : 

అబ్రహాము నమ్మిన దేవుడా 

నా పితరుల ఆరాధ్య దైవమా “2”

ఇశ్రాయేలు కాపరి - బహుగొప్ప నేర్పరి 

నీకు సాటియెవరు యేసయ్యా  “2”


సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా 

ప్రభాకరుడా బహు బలవంతుడా “2”

సత్యవంతుడా మహా పరిశుద్ధుడా 

ఆరాధనకు యోగ్యుడా  “2”


1.నీలి మేఘమును నీడగా మార్చి 

అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి 

సైన్యములకు నీవే సారధిగా నిలిచి 

నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన 

మా పక్షమైయున్న- మహారాజువు నీవే 

నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా


2.నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై 

నిరాశల నీడను తొలగించెదవు 

విస్తారమైన నీకృపలతో నింపి 

నిస్సారమైన బ్రతుకును మార్చెదవు విజయోత్సవముతో ఊరేగించెదవు 

నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా


3.సాత్వీకముతో - దీర్ఘశాంతముతో 

విసుగక నాయెడల వాత్సల్యము చూపి 

ఒంటరిగా నను ఎన్నడు విడువక 

వేదనలో నను దాటి వెళ్లక 

తల్లివలె ఒడిలో లాలించువాడవు 

తీరని నీ రుణము వివరింప తరమా


English Lyrics : 

Abrahaamu nammina Devudaa  

Naa pitarula aaraadhya daivamaa  “2”

Ishraayelu kaapari – bahugoppa nerpari  

Neeku saati evaru Yesayyaa  “2”


Sahaayakudaa nitya stotraarhudaa  

Prabhaakarudaa bahu balavanthudaa  “2”

Satyavanthudaa maha parishuddhudaa  

Aaraadhanaku yogyudaa  “2”


1.Neeli meghamunu needagaa maarchi  

Agni stambhamunu kaanthigaa nilipi  

Sainyamulaku neeve saaradhigaa nilichi  

Ninginantina godalu kuppagaa koolchina  

Maa pakshamaiyunna – mahaaraajuvee neeve  

Neeku saadhyamu kaanidi edainaa kaladaa  


2.Niraashrayulaku neeve nitya aashrayamai  

Niraashala needanu tholaginchedavu  

Visthaaramaina nee krupalatho nimpi  

Nissaaramaina brathukunu maarchedavu  

Vijayotsavamutho ooreginchedavu  

Neeku saadhyamu kaanidi edainaa kaladaa  


3.Saathveekamutho – deergha shaantamutho  

Visugaka naa yedala vaatsalyamu choopi  

Ontarigaa nanu ennadu viduvaka  

Vedhanalo nanu daati vellaka  

Thallivale odilo laalinchuvaadavuu  

Theerani nee runamu vivarimpa tharamaa



Short Song Details

  • Song Title: అబ్రహాము నమ్మిన దేవుడా
  • Category: Telugu Christian Worship Song
  • Theme: దేవుని విశ్వాసం, కృప, సహాయం
  • Language: Telugu




Description


“అబ్రహాము నమ్మిన దేవుడా” అనే ఈ ఆరాధనా గీతం దేవుని విశ్వాసాన్ని, కృపను మరియు ఆయన శక్తిని గుర్తుచేస్తుంది. అబ్రహాము విశ్వసించిన దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలు చేయగలడని ఈ పాట తెలియజేస్తుంది. నిరాశలో ఉన్నవారికి ఆశను ఇచ్చే దేవుడు, మనకు సహాయకుడు మరియు రక్షకుడు అని ఈ గీతం ద్వారా స్తుతించబడుతున్నాడు.


ఈ పాటలో దేవుని మహిమ, కృప మరియు ఆయన మన జీవితాలను విజయోత్సవంగా మార్చగల శక్తి గురించి గొప్పగా ప్రకటించబడింది.


Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book