Naa Hrudayaana Koluvaina Yesayyaa | Hosanna Ministries 2026 Songs | English and Telugu Lyrics
నా హృదయాన కొలువైన
Telugu Lyrics :
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా "2" "నా హృదయాన"
అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను "2"
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే "2"
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా "2" "నా హృదయాన"
అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే "2"
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే "2"
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును "2" "నా హృదయాన"
విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా "2"
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే "2"
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును "2" "నా హృదయాన"
English Lyrics :
Naa Hrudayaana Koluvaina Yesayyaa
Naa Anuvunuvu Ninne – Prasthuthinchene Keerthaneeyudaa
Naa Hrudayaarpanatho – Pranamilledhane
Nee Sannidhilo Poojaarhudaa "2" "Naa Hrudayaana"
Agni Edanthalai – Manduchundinanu
Agni Jwaalalu Thaakaledhule – Nee Priyula Dhehalaanu "2"
Agni Balamu Challaarene – Shathru Samoohamu Allaadene "2"
Nenu Nee Swaasthyame – Neevu Naa Sonthame
Naa Sthothrabalulanni Neekenayyaa "2" "Naa Hrudayaana"
Antha Vyarthamani – Vyarthulairendharo
Naa Guri Neepai Nilpinandhuke – Naa Parugu Saarthakamaayene "2"
Neeyandhu Padina Prayaasamu – Shaashwatha Krupaga Naayandhu Nilichene "2"
Neepai Vishwaasame – Nannu Balaparachene
Naa Swarametthi Ninne Keerthinthunu "2" "Naa Hrudayaana"
Vitthinadhi Okaru – Neeru Posindhi Verokaru
Eruvu Vesindhi Evvarainanu – Vruddhi Chesindhi Neeve Kadhaa "2"
Sanghakshemaabhivrudhhike – Paricharya Dharmamu Niyaminchinaave "2"
Nee Upadheshame – Nannu Sthiraparachene
Naa Sarvamu Neeke Arpinthunu "2" "Naa Hrudayaana"

Comments
Post a Comment