ఇమ్మానుయేలు రక్తము | Immanuyelu Rakthamu Song Lyrics

ఇమ్మానుయేలు రక్తము

ఇమ్మానుయేలు రక్తము

▶️ Listen to Song on YouTube
TELUGU LYRICS
తెలుగు
తెలుగు

ఇమ్మానుయేలు రక్తము

ఇంపైన యూటగు

ఓ పాపి! యందు మున్గుము

పాపంబు పోవును


యేసుండు నాకు మారుగా

ఆ సిల్వ జావగా

శ్రీ యేసు రక్త మెప్పుడు

స్రవించు నాకుగా


ఆ యూట మున్గి దొంగయు

హా! శుద్ధు-డాయెను

నేనట్టి పాపి నిప్పుడు

నేనందు మున్గుదు


నీ యొక్క పాప మట్టిదే

నిర్మూల మౌటకు

రక్షించు గొర్రె పిల్ల? నీ

రక్తంబే చాలును


నా నాదు రక్తమందున

నే నమ్మి యుండినన్

నా దేవుని నిండు ప్రేమ

నే నిందు జూచెదన్


నా ఆయుష్కాల మంతటా

నా సంతసం-బిదే

నా క్రీస్తు యొక్క రొమ్మునన్

నా గాన-మిద్దియే

ENGLISH LYRICS
English / Transliteration
English / Transliteration

Immaanuyelu Rakthamu

Impaina Yootagu

O Paapi! Yandu Mungumu

Paapambu Povunu


Yesundu Naaku Maarugaa

Aa Silva Jaavagaa

Shree Yesu Raktha Meppudu

Sravinchu, Naakugaa


Aa Yoota Mungi Dongayu

Haa! Shuddhu-daayenu

Nenatti Paapi Nippudu

Nenandu Mungudu


Nee Yokka Paapa Mattide

Nirmoola Mautaku

Rakshinchu Gorre Pilla? Nee

Rakthambe Chaalunu


Naa Naadhu Rakthamanduna

Ne Nammi Yundinan

Naa Devuni Nindu Prema

Ne Nindu Joochedan


Naa Aa-yushkaala Manthata

Naa Santhsam-bide

Naa Kreesthu Yokka Rommunan

Naa Gaana-middiye

🎵 Song Details
AUTHOR
Andhra Kraisthava Keerthanalu
SONG DESCRIPTION

ఇమ్మానుయేలు రక్తము అనే ఈ ఆత్మీయ క్రైస్తవ గీతం యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా పాపక్షమాపణ, శుద్ధీకరణ, రక్షణ లభిస్తాయని గుర్తుచేస్తుంది. యేసుక్రీస్తు మన కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తం ద్వారా మనకు విమోచన మార్గాన్ని తెరిచాడు. ఆయన రక్తమే పాపాలను కడిగి మనలను శుద్ధులుగా చేయగలదనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది.

ఈ పాటలోని ప్రతి చరణం దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని, ఆయన రక్తం ద్వారా లభించే రక్షణను మనకు గుర్తుచేస్తుంది. మన జీవితమంతా యేసుక్రీస్తును నమ్ముతూ, ఆయన ప్రేమలో ఆనందంగా జీవించాలని ఈ గీతం ప్రోత్సహిస్తుంది.

ఈ పాట యొక్క తెలుగు లిరిక్స్ మరియు English Transliteration ఇక్కడ చదవండి. మీకు ఈ పాట ఆశీర్వాదకరంగా అనిపిస్తే, ఇతరులతో కూడా పంచుకోండి.

Song Name: ఇమ్మానుయేలు రక్తము
Language: Telugu
Category: Telugu Christian Song Lyrics
Theme: యేసుక్రీస్తు రక్తం, పాపక్షమాపణ, రక్షణ, దేవుని ప్రేమ

#TeluguChristianSongs #TeluguChristianSongLyrics #ChristianLyrics #JesusChrist #Immanuel #Yesu #TeluguWorshipSongs

Comments

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics