Posts

Showing posts from March, 2020

Aanandham Neelone - Hosanna Ministries 2020

ఆనందం నీలోనే Youtube URL : https://www.youtube.com/watch?v=vXR7eyrMuJE ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై " ఆనందం నీలోనే " పదే పదే నిన్నే చేరగా I ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ " ఆనందం నీలోనే " నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన సత్య వాక్యమే జీవ వాక్యమే " ఆనందం నీలోనే " సర్వసత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో... ఈ దర్శనం నా ఆశయం.. " ఆనందం నీలోనే " English Lyrics : Aanandam neelone – Aadhaaram neevega Aasrayam neelone – Naa Yesayya, stotraarhuda /2/ Arhate leni nannu – preminchinaavu Jeevintunilalo neekosame saakshaardhamai /Aanandam/ Padepade ninne cheraga.. Pratikshanam neeve dhyaasaga.. /2/ ...

Patalathone Payanamu - Hosanna Ministries 2020

పాటలతోనే పయనం Youtube URL : https://www.youtube.com/watch?v=xdo-YaPcVfo పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా... తోడుండగా... తోడుండాగా... పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి ఎడారిలో సెలయేరులై... దాహము తీర్చితివి... దాహము తీర్చితివి... తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో... ఆత్మలో ఆనందించుచూ... ఆనందించుచూ.. ఆనందించుచూ.

Nuthana Geethamu ney padedha - Hosanna Ministries 2020

నూతన గీతము నే పాడెదా Youtube URL : https://www.youtube.com/watch?v=VpJXlG8hzQk నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ English Lyrics : Nuthana geethamu ney padedha - manoharudaa yesaiah neevu chupina premanu ney maruvanu - ye sthithilonaina samarpanatho sevinchedanu ninne - sajivudanai aaradhincheda koluvuchesi preminchinavu - koradhaginadhi yemundhi naalo swardhamerugani saathvikuda - neeku saatevvaru neevena pranamu - ninnu veedi nennundalenu kadali theeram kanabadanivela - kadal...

Naalo Nivasinche Naa Yesaiah - Hosanna Ministries 2020

నాలో నివసించే నా యేసయ్య Youtube URL : https://www.youtube.com/watch?v=m7YUOAoxKww   నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా " 2 "   మారని మమతల మహనీయుడ " 2 " కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య " 2 " " నాలో నివసించే " మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం " 2 " నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను " 2 " ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను " 2 "                             " కీర్తించి నిన్నే " వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే ఏమని వర్ణింతును నీ కృపలను                                           " కీర్తించి నిన్నే " మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం " 2 " సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింత...

Nee Prema Naalo Madhuramainadhi - Hosanna Ministries 2020

నీ ప్రేమ నాలో మధురమైనది Youtube URL : https://www.youtube.com/watch?v=rwNAUF2Sqec నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో” చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్త...

Vinarandi Naa Priyuni - Hosanna Ministries 2020

వినరండి నా ప్రియుని విశేషము Youtube URL : https://www.youtube.com/watch?v=7iOU1U6jM4o వినరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూపితిని ఆహా! ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశాపందిరిలో జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరువే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయద్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగముగ క్షణముగ జీవింతును తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్దహృదయాల వీరులతో ఫలము ప్రతి ఫలము నే పొందుకోని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచేదను ఆ శుభవేళ నా కెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు English Lyrics : Vinarandi naa priyuni visheshamu - naa varudu sundarudu mahaganudu naa priyuni needalo cherithini - premaku roopamu chupithini aah...

JANANAM ASCHARYAM Lyrics

JANANAM ASCHARYAM Youtube URL :  https://www.youtube.com/watch?v=r1YSWjFodvI English Lyrics only Jananam ascharyam-maranam mahayagam Tharunam nee thyagam lokanikey premey nee margham-narule nee laksham siluve oka saksham yesu.. yesu... Nee naamam parishuddham nee roopam athi madhuram nee paluke bangaram yesu.. yesu.. prathi udayam prathi reyee prathi samayam brathukantha nee dhyase na aasha yesu.. yesu..(2) Yese naa dhaivam-yese naa jeevam yese naa pranam yese.. yese.. yese naa prabhuvu-yese naa vibhudu yese shehithudu yese.. yese.. Yese naa dhairyam-yese naa abhayam yese naa vijayam yese.. yese.. yese naa geetham-yese naa raagam yese sangeetham yese..yese..(nee naamam) Hrudayam kaarunyam-krupaye ne dharmam kavacham nee vuniki lokaneekey nee rajyam shashwathamu-nee balamu bahughanamu nee mahima unnathamu yesu.. yesu.. Nee neethi nee keerthi nee kriyalu aasamanam nee woohe naa oopiri yesu.. yesu.. santhosha samayamuna shodhanulu sramalaina nee...

నీవే కృపాధారముత్రియేక దేవా Song Lyrics

NEEVE KRUPAADARAMU TRIYEKA DEVA నీవే కృపాధారముత్రియేక దేవా YOUTUBE URL :   https://www.youtube.com/watch?v=-AfiQiCjGeY Telugu Lyrics నీవే కృపాధారముత్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా (2) నూతన బలమును నవ నూతన కృపను (2) నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా … (నీవే) ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను (2) ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2) ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా (2) (నీవే) సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి (2) సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి (2) శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా (నీవే) ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి (2) పరిశుద్ధులతో నను ని...