Posts

Showing posts from July, 2022

Anni saadhyame yesulo || Telugu Christian song ||

నన్ను బలపరచు యేసునందే   Click here to watch on YouTube  నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో  సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| నీటిని చీల్చి - బాటను వేసి నరులను నడిపించెనే బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే నీటిపై నడిచెనే - నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము॥ హోరేబు కొండపై - మండే పొద నుండి మోషే మాట్లాడెనే బలిపీఠముపై - అగ్నిని కురిపించి మహిమను కనుపరచెనే షద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే నరకపు మంటనుండి నను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా... ॥సాధ్యము॥

||Neevu thappa nakevaru unnarayya|| నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య ||

Neevu thappa nakevaru unnarayya Click here to watch on YouTube  పల్లవి:- నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య  నాకంటు ఉన్నది నీవెనయ్య(2)  తల్లివైన నీవే నా తండ్రివైన నీవే(2) నాకున్నదంటు నీవెనయ్య(2) యేసయ్య... యేసయ్య...యేసయ్య...యేసయ్య( 2 ) 1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా... ఈ లోకమైన పరలోకమైన నాకున్నదంటు నీవెనయ్య ( యేసయ్య... ) 2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా... జీవించినను నే మరణించినను నా గమ్యము నీవెనయ్య (యేసయ్య... )

Nee Pilupu | Benny Joshua | song lyrics

నీ పిలుపు Click here to listen on Youtube. Telugu lyrics : నీ పిలుపు వలన నేను నశించి పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు     "2" 1.నశించుటకు ఎందరో వేచియున్నను   నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను   ద్రోహము నిందల మధ్యలో నే నడచినను     నీ నిర్మల హస్తము నన్ను భరియించెను    యజమానుడా నా యజమానుడా...    నన్ను పిలచిన యజమానుడా    యజమానుడా నా యజమానుడా...   నన్ను నడిపించే యజమానుడా 2.మనుషులు మూసిన తలుపులు కొన్నైనను   నాకై నీవు తెరచినవి అనేకములు   మనోవేదనతో నిన్ను విడిచి    పరుగెత్తినను   నన్ను వెంటాడి నీ సేవను చేసితివి   నా ఆధారమా నా దైవమా   పిలిచిన ఈ పిలుపునకు కారణమా     "2" 3.పిలిచిన నీవు నిజమైన వాడవు    నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు   ఏదేమైనను కొనసాగించితివి   నీపై ఆధారపడుటకు అర్హుడవు   నిన్ను నమ్మెదను, వెంబడింతును   చిరకాలము నిన్నే సేవింతును     "2"   నీ పిలుపు వలన నేను నశించి పోలేదు...

Sthothrabali Sthothrabali song Lyrics

స్తోత్రబలి స్తోత్రబలి Click here to watch on Youtube. Telugu Lyrics: స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే    "2" నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే    "2" నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా    "2" కోటి కోటి స్తోత్రం డాడి   "3"       "స్తోత్రబలి" రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి    "2" మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును    "2" కోటి కోటి స్తోత్రం డాడి    "3"       "స్తోత్రబలి" నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి    "2" ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి    "2" కోటి కోటి స్తోత్రం డాడి    "3"       "స్తోత్రబలి" వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు    "2" యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును    "2" కోటి కోటి స్తోత్రం డాడి    "3"       "స్తోత్రబలి" English Lyrics: Sthothrabali Sthothrabali Manchi Devaa Neekenayyaa Shubhavela Aanandame Naa Thandri ...

ఫలియించుచు || Phaliyinchuchu song lyrics

ఫలియించుచు Click here to watch on YouTube. ఫలియించుచు.. ఎదిగే కృప నాపై ఉండనీ... "2" జ్వాలియించుచు,వెలిగే మహిమతో నిండనీ... "2"  తరగనీ నీ ప్రేమ అనుభవించనీ.. "2" ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ... "2" "ఫలియించుచు" స్థితిగతులేవైన - ప్రతికూలాతలైన.. బేధరక సంతోషించనీ... "2"  దేనికి సనగక, ప్రశ్నలు అడగక... "2" నీ చిత్తం ప్రకారము సర్వం చేస్తూ క్షేమం పొందనీ.. ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ... "2" "ఫలియించుచు" విసుగక చెయ్యందించనీ... "2"  మేలులమరువక.. సన్నిధి విడువక... "2" ఇతరులకేదైనా.. అక్కరులోనైనా.. నీ నామ ప్రభావం గానం చేస్తూ ఆరాదించనీ... ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ... "2" "ఫలియించుచు" ప్రాణం పెటైనా... ఆత్మల కొన్నైన... అలయక సంపాదించనీ.. "2" సుఖమును కొరక... వెనుకకు చూడక... "2"  నీ వాక్య ప్రభోదం మానక చేస్తూ సాక్షిగా ఉండనీ.. ప్రియుడా యేసయ్య నిన్నే ప్రేమించనీ... "2" "ఫలియించుచు"

Nee rakthame nirapharadham song lyrics

నీ రక్తమే Click here to watch on YouTube. నీ రక్తమే - నిరపరాధము  నీ త్యాగమే - ప్రేమ సందేషము నీ రక్తమే నిష్కళంకము - నీ రక్తమే నిర్దోషము క్రొత్తనిబందన నీ రక్తము - నిత్యనిబందన సంబంధము నీ రక్తమే నిష్కళంకము - నీ రక్తమే నిర్దోషము 1. స్వరక్తమిచ్చి కొన్నావయా - సురూపమును కొల్పోతివా బదులాశించనిది - యేసయ్య ప్రేమ బదులేమి - నేనివ్వగలనయ్యా ...."2" "నీ రక్తమే" 2. శిరముపై ముళ్ళకిరీటం - మోముపై ఉమ్మివేతలూ బదులాశించనిది - యేసయ్య త్యాగం బదులేమి - నేనివ్వగలనయ్యా ...."2" "నీ రక్తమే" 3. విలువైన రక్తంబుతో - వెలపెట్టి కొన్నవయా బదులాశించనిది - యేసయ్య రక్తం బదులేమి నేనివ్వగలనయ్యా ......"2" "నీ రక్తమే"

Prabhu aathma naalo nindiporlinappudu song lyrics

ప్రభు ఆత్మ Click here to watch on YouTube. Telugu Lyrics: ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు  దావీదువలె నేను నాట్యమాడెదన్  నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను దావీదువలె నేను నాట్యమాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు  దావీదువలె నేను పాటపాడెదన్ పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను దావీదువలె నేను పాటపాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు  దావీదువలె నేను స్తుతించెదను స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను దావీదువలె నేను స్తుతించెదను English Lyrics: Prabhu aathma naalo nindiporlinappudu dhaaveedhuvale nenu naatyamaadedhan naatyamaadedhan nenu naatyamaadedhan nenu dhaaveedhuvale nenu naatyamaadedhan Prabhu aathma naalo nindiporlinappudu dhaaveedhuvale nenu paata paadedhan paata paadedhan nenu paata paadedhan nenu dhaaveedhuvale nenu paaTapaa Dedan Prabhu aathma naalo nindiporlinappudu dhaaveedhuvale nenu sthuthinched hanu sthuthinchedhan nenu sthuthinchedhan nenu dhaaveedhuvale nenu sthuthinchedhanu

Nenante neekendhuko ee prema song lyrics

నేనంటే నీకెందుకో Click here to watch on YouTube. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచి పోవెందుకో  నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచి పోవెందుకో "2"  కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో  కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో  నా ప్రాణమైనావు నీవు  ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు  నిన్ను విడచి వెళ్ళినా, నన్ను వీడిపోలేవు ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా "2" ఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను..  "నేనంటే నీకెందుకో" ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలి నా పై యేసయ్యా,, ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి  తాళలేను-నీప్రేమను "నేనంటే నీకెందుకో"

Anjali ghatiyinchinaamu song lyrics

అంజలి ఘటియించినాము Click here to watch on Youtube. అంజలి ఘటియించినాము  అందరి మనసులలోని చీకటుల  హరియించి తరియింప చేయగా  నీ సుందర పదములముందర మేమందరము యేసు...  అంజలి ఘటియించినాము...  వాడుకగా వాక్యమును చదివితిమి గాని  వాస్తవముగ దాని భావమే మరచితిమి  ఆచారముగా ఆలయమేగితిమి గాని  ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి  తుదకు వాక్యము నీవని ఎరిగితిమి  నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు  అంజలి ఘటియించినాము...  వేదనలో నీ వేదమునే తలచి  వేడుకలో నీ నామమే మరచి  స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి  విలపించి తలవంచి  అంజలి ఘటియించినాము... పాపాప పద పాపాప పద పాపాప పమపమగరిసరిగమ పాపామపదపా పమపదనీనీనినిసని  మపదనిసాసానిసారిసా సరిగమపమగరిసానిదపమా గమని గమనీనీ   గమని గమనీని సగప సగపాప   సగప సగపాప సరిగ సరి గమపమ  సరిగ సరి గమపమ రిగమరి గమపదని  రిగమరి గమపదని  తధీమ్ త తకిట తఝo త తఝణు  తక తకిట తకధిమిత  తక ఝణుత  సరిగమ పమగరి గమపద నిదపమ పదనిసరిగమపమగరిసనిదపమ మాపదనిస గామపదని రీగామపద సారిగమదప మగరి సగరి గమ గమప గమపద...

Nee pilupe song Lyrics

నీ పిలుపే   Click here to watch on Youtube. నీ పిలుపే నా దరి చేరే -  నీతోటి నా స్నేహమా  నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా      "2" కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన  నిన్ను చేరేటి సంతోషమా     "2"  "నీ పిలుపే" 1. కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే  ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా  ఆలకించావు నా ప్రార్ధన - ఆదరించావు నా యేసయ్య  నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే  అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తన కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన  నిన్ను చేరేటి సంతోషమా  నీ పిలుపే నా దరి చేరే -  నీతోటి నా స్నేహమా  2. చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే  జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన  తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన  నీ పిలుపే నా దరి చేరే -  నీతోటి నా స్నేహమా  నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన  నిన్ను చేరేటి సంతోషమా

Manasa By samy pachigalla Song lyrics

 మనసా మనసా Click here to watch on Youtube. పల్లవి: మనసా మనసా సోలిపోనేల           మనసా మనస్సా నిరాశ నీకేలా         "2" చరణం: వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా  నిరీక్షణ లేకనే  తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగా మరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే  నాకు చాలయ్యా...ఆ....      "మనసా" చరణం: ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా  తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా పిలిచెనుగా సమర్పిస్తున్న దేవునికై జీవితాంతము సాక్షినై నిత్యము నా యేసుతో జీవించగా      "మనసా"

Ninnu poojinchi bhajiyinchi sthotrinthunu song lyrics

నిన్ను పూజించి భజియించి స్తోత్రింతును Click here to listen on Youtube. నిన్ను పూజించి భజియించి స్తోత్రింతును స్తుతి మనసార అర్పింతును "2" కష్టకాలమైన నష్టసమయమైన నీదు నామము ఘనపరతును "2"  హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు "2" "నిన్ను" 1. తల్లియు తండ్రియు నీవే నా ఆదరణ కర్తయు నీవే "2" నరులందరు నను నిందించిన నీదు మహిమను చూపితివే - మహిలో సాక్షిగా నిలిపితివే హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు 2 2. నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైతే మరి లాభము "2" ఆత్మతోను సత్యముతో నీదు నామము ప్రకటింతును - జీవితాంతము ప్రచురింతును - హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు "2" "నిన్ను"