నా జీవితానికి యజమానుడా || Naa jeevithaniki yahamaanuda song lyrics
నా జీవితానికి యజమానుడా
Click here to listen on YouTube.
Telugu lyrics:
నా జీవితానికి యజమానుడా
నిను మాత్రమే కొలుతునేసయా. “2”
నిత్య మహిమలో నిను చూచే వరకు
నా స్తుతి యాగము ఆపనేసయా “2” “నా జీవితానికి”
కన్నీటి లోయ ఆవేదనల ఛాయ
లోకపు మాయ నే తాళలేనయా “2”
అరచేతిలో చెక్కుకున్నవాడా
ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా “2” “నా జీవితానికి”
గుండె జారిపోయె నిందలెన్నో
ఆత్మీయులతో అవమానాలెన్నో “2”
పోరాడుటకు నా బలము చాలక
నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా “2” “నా జీవితానికి”
నా యాత్రలో ఏమి జరిగిన
స్తుతియించుచునే నే సాగిపోదును “2”
నా తనువంతా నీ పని కోసమే
నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా “2” “ నా జీవితానికి”
Comments
Post a Comment